సిరిసిల్ల, జనవరి 2: రైతుబంధు కింద ఎనిమిది విడుతలుగా రూ.50 వేల కోట్ల మేర పంట సా యం అందించిన సందర్భంగా ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 10 వరకు రైతుబంధు వారోత్సవా లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. స్వ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీ ఆర్ రైతును రాజుగా చేసేదిశగా అడుగులు వేస్తు న్నారు. ఇందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మ కమైన రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధుసమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడి రైతు బంధు వారోత్సవాలు నిర్వహించాలని టెలీకాన్పరెన్స్ ద్వారా అధికారు లను ఆదేశించారు. సోమవారం నుంచి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మించిన రైతు వేదికల్లో ఈ కార్యక్ర మాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
జనవరి 3 నుంచి 7 వరకు..
ఉన్నత పాఠశాలలోని 8,9,10 తరగతి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు 1. వ్యవసాయం-దాని ప్రాధాన్యత, 2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భారానికి ముందు ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగ పరిస్థితి, 3. రైతు బంధు సంబంధిత అంశాలపై నిర్వహించాలి.
జనవరి 8, 9 తేదీల్లో..గ్రామాల్లో ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించాలి. ఉత్త మ ముగ్గులను ఎంపిక చేసి బహుమతులు అందజేయాలి.
జనవరి 10న అన్ని రైతు వేదికల్లో ..
1.రైతుల ఆత్మీయ సమ్మేళనం
2.ఎడ్లబండ్లు/ట్రాక్టర్లతో ఊరేగింపు
3.డప్పులతో, తప్పెళ్లతో రైతుల ప్రదర్శనలు
4.పాఠశాల విద్యార్థులు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. కాగా, సర్కారు నిర్దేశించిన మేరకు ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించనున్నారు.