ఓదెల/కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 1: తెలంగాణలో రైతుల క్షేమం కోరే ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓదెల మండలంలోని కొలనూర్, గూడెం, గుంపుల, ఇందుర్తి, శానగొండ, బీమరిపల్లె, పొత్కపల్లి, ఓదెల, నాంసానిపల్లి, అబ్బిడిపల్లె గ్రామాల్లో, కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి, గంగారం, చిన్నరాత్‌పల్లి, మొట్లపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రైతులపై ఉన్న ప్రేమతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. రైతులకు ఏ బాధలు రాకుండా చూసుకుంటున్న ప్రభుత్వం ఇక్కడ ఉందన్నారు. విత్తనం పెట్టడం నుంచి మొదలుకొని కొనుగోలు వరకు అన్నింటా రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు కూనారపు రేణుకాదేవి, నూనేటి సంపత్ జడ్పీటీసీలు గంట రాములు, వంగళ తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొట్టె సుజాత రవీందర్, విండో చైర్మన్లు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, చదువు రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ కామిడి సంధ్య వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు పల్లె కుమార్‌గౌడ్, జూకంటి శిరీష, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, సర్పంచులు గోవిందుల ఎల్లస్వామి, తిప్పారపు చిరంజీవి, అంబాల సంధ్యారాణి, కల్లెపల్లి సరిత, పోతుగంటి రమ, ఒజ్జె కోమలత, ఆడెపు శ్రీదేవీరాజు, అరెల్లి సుజాతా రమేశ్, కొనుకటి మల్లారెడ్డి, గోనె శ్యాం, దాసరి నవలోక, ఎంపీటీసీలు జీల తిరుపతి, కారెంగుల శ్రీనివాస్, మాదాసి సువర్ణా రాంచంద్రం, సుముఖం నిర్మలామల్లారెడ్డి, కుదురు మానసాసతీశ్, బొల్లమల్ల కౌసల్యాశంకర్, ఆర్బీఎస్ కన్వీనర్ నిదానపురం దేవయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్‌కుమార్, తహసీల్దార్ సునీత, డీఆర్డీవో శ్రీధర్, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఏవో నాగార్జున, ఏపీఎం సదానందం, సీఈవో కోలేటి శ్రీనివాస్, నాయకులు ఆకుల మహేందర్, గోపు నారాయణరెడ్డి, మడ్డి శ్రీనివాస్ గౌడ్, కనికిరెడ్డి సతీశ్, పాకాల సంపత్ రెడ్డి, మద్దెల నర్సయ్య, బండారి ఐలయ్య, గట్టు మహేశ్ గౌడ్, గుంటి శ్రీనివాస్, ఢిల్లీ శంకర్, బోడకుంట నరేశ్, బోయిని తిరుపతి, బోడకుంట చినస్వామి, తీర్తాల కుమార్, వంగ శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి, నూనేటి కుమార్, కూకట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.