ఉదయం నుంచీ సాయంత్రందాకా అలుపెరుగని యాత్ర
ఆయాగ్రామాల్లో అడుగడుగునా ప్రజల నీరాజనం
డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు నృత్యాలతో ఘనస్వాగతం
ఎక్కడికి వెళ్లినా బొట్టు పెట్టి మరీ ఇంట్లోకి ఆహ్వానం
నువ్వే గెలుస్తావ్ బిడ్డా’ అంటూ అభయం
ఏకమైన ప్రజలు.. ఊరంతా ఆశీర్వాదం
పరకాల (కమలాపూర్), అక్టోబర్ 1 ;ఉద్యమ బిడ్డ.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కమలాపూర్ మండల ప్రజలు జైకొట్టారు. శుక్రవారం ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లిలో కలియదిరుగగా, బ్రహ్మరథం పట్టారు. డప్పుచప్పుళ్లు.. గొల్లకుర్మల విన్యాసాలతో వీధివీధినా నీరాజనం పలికారు. ఓటేయాలని ఏ ఇంటికి వెళ్లి అభ్యర్థించినా బొట్టుపెట్టి.. మంగళహారతులతో ఇంట్లోకి స్వాగతించారు. “మా కండ్ల ముందు పెరిగినోనివి.. తెలంగాణ కోసం కొట్లాడితివి.. కేసీఆర్ పంపిన బిడ్డవు.. నువ్వే గెలుస్తవ్’ అంటూ ఆశీర్వదించారు. ఒక్కొక్కరు గెల్లు అడుగులో అడుగు కలుపుతూ ఊరంతా ఆయన వెంట నడిచి, ‘నీ వెంటే ఉన్నాం’ అనే సందేశాన్ని చాటిచెప్పారు. కాగా, సాయంత్రం భీంపల్లిలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరుకాగా, జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కారుకు జై కొట్టారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కమలాపూర్ మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం ఉదయం ఉప్పల్, సాయంత్రం ఉప్పలపల్లి, భీంపల్లిలో ప్రచారం చేయగా, నీరాజనం పట్టారు. ఎక్కడికి వెళ్లినా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీనివాస్‌ను ఆశీర్వదించారు.
హోరెత్తిన ధూంధాం
భీంపల్లి ధూంధాం హోరెత్తింది. మహిళలు పెద్ద ఎత్తున్న బతుకమ్మలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మంత్రి హరీశ్‌రావు, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కళాకారుడు సాయిచంద్ పాడిన పాటలకు ప్రజలు నృత్యం చేశారు. అనంతరం హరీశ్‌రావు సమక్షంలో పలు గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఆయాచోట్ల విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి, సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్ రావు, ఎంపీటీసీలు ఎర్రబెల్లి సంపత్ రావు, తూర్పాటి అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు స్వర్గం రవి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మెండెద్దుల రాజమౌళి, సర్పంచ్ జవ్వాజి పద్మ, ఉపసర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, నాయకులు నవీన్‌కుమార్, లక్ష్మణ్‌రావు, కిషన్‌రావు, కుమారస్వామి, ప్రభాకర్ ఉన్నారు.
రాములోరి ఆలయంలో ‘గెల్లు’
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 1 : నామినేషన్ వేసే ముందు గెల్లు శ్రీనివాస్ ఇల్లందకుంట రాములోరి ఆశీస్సులు తీసుకున్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి ఆలయానికి చేరుకోగా, టీఆర్ఎస్ నాయకులు, కళాకారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనుతో పూజారులు శేషం వంశీధరాచార్యులు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం నామినేషన్ పత్రాల సెట్‌కు స్వామి వారి వద్ద పూజలు చేయించి, గెల్లుకు అందించారు. అనంతరం శ్రీనివాస్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. గెల్లు శ్రీనివాస్‌ను ఎత్తుకొని ‘టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదించారు. ఇల్లందకుంట కూడలిలో టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ సరిగొమ్ముల పావనీవెంకటేశ్, సర్పంచులు కంది దిలీప్‌రెడ్డి, కలాల రాజిరెడ్డి, ఎండీ రఫీఖాన్, ఆదిలక్ష్మి, రజిత, మొగిలి, సరోజన, మానస, వెంకటస్వామి, లలిత, అరుణ, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, విజయ్‌కుమార్, మోటపోతుల ఐలయ్య, రేణుకుంట్ల చిన్నరాయుడు, తెడ్ల ఓదేలు, ఉప సర్పంచ్ తిరుపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి, డీసీసీ డైరెక్టర్ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మాజీ ఎంపీటీసీ పెద్ది కుమార్, రజక సంఘం మండలాధ్యక్షుడు రావుల ఎల్లయ్య, నాయకులు పొడేటి వేణు, విక్రం, సమ్మిరెడ్డి, దేవేందర్, రవీందర్‌రెడ్డి, హరిబాబు, రాజిరెడ్డి, రాజబాబు, ప్రశాంత్, ఇల్లందకుంట గ్రామ ఇన్‌ఛార్జి దేవన్న ఉన్నారు.