గోదావరిఖని, ఆగస్టు 1: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియోజకవర్గ ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో సుఖ సంతోషాలనే గాకుండా కష్టాల్లో కూడా తోడు నిలిచే వారే నిజమైన స్నేహితులని, వారు లేని జీవితం వ్యర్థమని, ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం ఒక్కసారైనా అవసరం పడుతుందని వివరించారు. జీవితంలో ఆస్తులు కూడబెట్టకపోయినా ఫర్వాలేదు కానీ ఒక మంచి స్నేహితుడిని మాత్రం కచ్చితంగా సంపాదించుకోవాలని పేర్కొన్నారు.
జూలపల్లి, ఆగస్టు 1: మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఒకరికొకరూ చేతులకు కంకణాలు కట్టుకుని సంబురాలు చేసుకున్నారు. అనంతరం పలువురికి స్వీట్లు పంచి పెట్టారు. ఇక్కడ నాయకులు మానుమండ్ల శ్రీనివాస్, మామిడిపెల్లి కాంతయ్య, మామిడిపెల్లి చంద్రశేఖర్, మాంకాలి అంజయ్య, అఫీజ్, గొడిశెల రాంచంద్రం, ముమ్మాడి రవి, మల్లారపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
కోల్సిటీ, ఆగస్టు 1: గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వేడుకలు చేసుకున్నారు. గోదావరిఖని నగరంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ఆదివారం కేక్ కట్ చేసి కళాకారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య స్నేహం విలువపై వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సోగాల వెంకటి, ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీనివాస్, రేణికుంట రాజమౌళి, కాసిపాక రాజమౌళి, నాగుల శ్రీనివాస్, శశిభూషణ్, పానుగంటి అంజలి, రాజేశం, సందీప్, రవీందర్, సురక్షణ్, రాజబాబు, వెంకటేశ్వరరావు, వెంకట్రాజం, సిరిపురం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.