రాయికల్, జనవరి 11 : బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాయికల్ పట్టణంలోని 3వ వార్డు ఇంద్రనగర్ కాలనీకి చెందిన సందేల విక్రమ్‌తో పాటు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్ మారంపెల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, కౌన్సిలర్లు మారంపల్లి సాయికుమార్, తురగ శ్రీధర్ రెడ్డి, కుశనపెల్లి సురేశ్, సందేలా లక్ష్మీనారాయణ, సాలికే మహిపాల్, కాదాసు అన్వేష్, అర్ఫాత్, కోలా అరవింద్, నేరెళ్ల విజయ్, కనకలక్ష్మి, సందేలా లక్ష్మి, సొరపాక వజ్ర తదితరులు పాల్గొన్నారు.