ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే జైలుకే
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గడువు ముగిసిన, తక్కవ క్వాలిటీ, నకిలీ మత్తు మందులకు సంబంధించినవి అమ్మితే చర్యలుంటాయని స్పష్టం చేశారు.
- సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
- మెడికల్ షాప్, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం
సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 14: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గడువు ముగిసిన, తక్కవ క్వాలిటీ, నకిలీ మత్తు మందులకు సంబంధించినవి అమ్మితే చర్యలుంటాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రేణుకా మాతా ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మెడికల్ ఏజెన్సీ, మెడికల్ షాప్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్శాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు.
ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై వరుసగా దాడులు చేస్తూనే, ఇతర మత్తు పదార్థాలపైనా దృష్టిపెట్టినట్లు చెప్పారు. యువత సింథటిక్ డ్రగ్స్ వైపుకు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు తరుచూ మత్తు మందు కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. ప్రతి షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన డీ- అడిక్షన్ సెంటర్కి సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, టౌన్ సీఐ రఘుపతి, మెడికల్ షాప్ నిర్వహకులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

