మానకొండూర్ రూరల్, అక్టోబర్ 18: ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. సోమవారం మండలంలో ముంజంపల్లి, గంగిపల్లి, కొండపల్కల, మద్దికుంట, పచ్చునూర్, ఊటూర్, రంగపేట, దేవంపల్లి, లలితాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్ధతు ధర పొందాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.1,960, బీ గ్రేడ్‌కు రూ.1,940 చొప్పున మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ధాన్యం విక్రయించిన పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, సొసైటీ అధ్యక్షుడు నల్ల గోవిందరెడ్డి, కసిరెడ్డి లతా-ప్రభాకర్‌రెడ్డి, ముద్దసాని ప్రదీప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మల్లగల్ల నగేశ్, వాల ప్రదీప్‌రావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోపు రవీందర్‌రెడ్డి, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ కడారి ప్రభాకర్, సొసైటీ సీఈవో రవీందర్, సర్పంచులు ఎలగందుల సుదర్శన్, రామంచ గోపాల్‌రెడ్డి, నర్మెట వసంత, ఉప సర్పంచ్ కుమార్, ఐకేపీ సిబ్బంది, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు శంకరపట్నం మండలంలో..
ఈ నెల 19న రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండలానికి రానున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. అంబాల్‌పూర్, ముత్తారం గ్రామాల్లో తాడికల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మెట్పల్లి విండో పరిధిలోని కన్నాపూర్, ధర్మారం గ్రామాలు, గద్దపాక విండో పరిధిలోని గద్దపాక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు హాజరుకావాలని కోరారు.