e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home కామారెడ్డి ప్రజలతో మమేకమై సేవలందిస్తేనే సార్థకత

ప్రజలతో మమేకమై సేవలందిస్తేనే సార్థకత

నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 13 : ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై సేవలందించినప్పుడే తమ పదవులకు సార్థకత లభిస్తుందని రూరల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ అన్నారు. మండలంలోని మల్లారంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి బాజిరెడ్డి జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమంకోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలువడం గర్వించదగిన విషయమన్నారు. అంతకుముందు గ్రామస్తులు బాజిరెడ్డి జగన్‌కు ఘనస్వాగతం పలికారు. దుర్గామాత ఆలయంలో పూజల అనంతరం జగన్‌ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సమస్యలను పరిష్కరించాలని పలువురు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుమలత, ఎంపీపీ అనూషాప్రేమ్‌దాస్‌నాయక్‌, వైస్‌ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మధుకర్‌రావు, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు బొల్లెంక గంగారెడ్డి, అంకల గంగాధర్‌, ముత్యంరెడ్డి, నుడా డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఎస్టీసెల్‌ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, సర్పంచులు నగేశ్‌, అశోక్‌, అనూష, హరినాయక్‌, రాంగోపాల్‌రెడ్డి, ప్రవీణ్‌గౌడ్‌, సొసైటీ చైర్మన్లు స్వామి, దాసరి శ్రీధర్‌, నాయకులు బాల్‌రాజ్‌, గాజుల శంకర్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement