గురువారం 04 మార్చి 2021
Kamareddy - Jan 25, 2021 , 00:01:29

గుండెపోటుతో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

గుండెపోటుతో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ 

రాజంపేట, జనవరి 24: మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన రైతుబంధు సమితి గ్రామ సమన్వయకర్త రంగ నర్సాగౌడ్‌ (48) శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన గతంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. నర్సాగౌడ్‌ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాల్గొని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. 

VIDEOS

logo