శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 23, 2021 , 00:36:35

‘గల్ఫ్‌గోస’కు రెండు అవార్డులు

‘గల్ఫ్‌గోస’కు రెండు అవార్డులు

ఆర్మూర్‌, జనవరి 22 : హైదరాబాద్‌లోని శిల్పకళ వేదికలో చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘గల్ఫ్‌ గోస’ షార్ట్‌ఫిల్మ్‌కు రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉందని ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ సంఘం వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. ఆర్మూర్‌లో శుక్రవారం ఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గల్ఫ్‌గోస షార్ట్‌ ఫిల్మ్‌కు ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకత్వం విభాగాల్లో అవార్డులు వచ్చాయని, వీటిని మా పల్లె చారిటబుల్‌  ట్రస్ట్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి అందజేసినట్లు చెప్పారు. రెండు అంతర్జాతీయ అవార్డులు రావడం మరిచిపోలేనిదన్నారు. ఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌ న్యాయ సలహాదారుడు బాలయ్య, పసుపు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు నరేందర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo