జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి

బాన్సువాడరూరల్/నిజాంసాగర్: పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తం గా మంగళవారం ప్రారంభమైంది. జీవాల పెంపకం దారులు తప్పకుండా నట్టల నివారణ మందు వేయిం చాలని పశువైద్యులు సూచించారు. బీబీపేట్ మండల కేంద్రంలో మంగళవారం పశువైద్యాధికారిణి హేమశ్రీ ఆధ్వర్యంలో 2,253 గొర్రెలు, 377 మేకలకు నట్టల నివారణమందు వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలా మణి, సర్పంచ్ తేలు సత్యనారాయణ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మం డలంలోని మత్తమాల, మల్కాపూర్ గ్రామాల్లో పశువైద్య సిబ్బంది పశువైద్యురాలు అర్చన జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. సర్పంచ్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. గాంధారి మండల కేంద్రంలో జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధాబలరాంతో కలిసి జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సతీశ్, ఎంపీటీసీలు పత్తి శ్రీను, తూర్పు రాజు, ఉప సర్పంచ్ రమేశ్, పశువైద్య సిబ్బంది రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువైద్యాధికారిణి రమ్య దేవి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పైడి జానకి, పశుగణ సహాయకులు జుగల్ కిశోర్, ఎంపీటీసీలు సంకరి లక్ష్మి, ఎడ్ల రేణుక, గొర్రెల, మేకల పెంపకం దారుల సం ఘం మండల అధ్యక్షుడు బొంబాయి మల్లయ్య, జోగు పెద్ద మల్లయ్య, బీరయ్య, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని నాగారంలో కార్యక్రమాన్ని సర్పంచ్ రాచప్ప ప్రారంభించారు. పశువైద్యాధికారి నారాయణ సిబ్బందితో కలిసి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు మోహన్, పశువైద్య సిబ్బంది వెంకటేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో కార్యక్రమాన్ని సర్పంచ్ దరాస్ సూర్యకాంత్ ప్రారంభించారు. పశువై ద్యాధికారి విజయ్‌కుమార్ జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ విఠల్, ఎంపీ టీసీ సంగీత, నాయకులు కుశాల్, హన్మాండ్లు, సిబ్బంది దివ్య తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలం గోర్గల్‌లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, పశువైద్యాధికారి యూనుస్, నాయకులు సాయిలు తదితరులు పాల్గొన్నా రు. జుక్కల్ మండల కేంద్రంలో కార్యక్రమాన్ని సర్పంచ్ రాములు ప్రారంభించారు.
కార్యక్రమంలో పశువైద్యుడు పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో 5022 గొర్రెలకు, 1097 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు పశువైద్యుడు రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్‌గౌడ్, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గ్గొన్నారు.
తాజావార్తలు
- భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..
- చుక్కలు చూపించిన శార్దూల్, సుందర్.. టీమిండియా 336 ఆలౌట్
- కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్