ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్.. పట్టుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మహబూబ్‌నగర్ : తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ (36) బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వస్తున్నాడు.
హైదరాబాద్ నుంచే కర్ణాటక వెళ్తున్న బొలెరో వాహనాం రాజాపూర్ శివారులో బైక్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరోను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
బైక్ ను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన బొలెరో వాహనాన్ని ఛేజ్ చేసి 3 కి.మీ లోపే పట్టుకున్నారు. మంత్రి వాహనాన్ని అడ్డంగా పెట్టి బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన శ్రీనివాస్ ను రాజాపూర్ పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్‌కు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు పంపించారు. తన కండ్ల ముందే ప్రమాదాన్ని చూసి వెంటనే మానవత్వంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే బాధితునికి వెంటనే చికిత్స అందింది.
తప్పుచేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారని స్థానికులు తెలిపారు. మంత్రి సాయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

