సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 11, 2020 , 01:34:48

నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

శక్కర్‌నగర్‌: బోధన్‌ పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11నుంచి 15 వరకు 17వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. మంగళవారం నుంచి ఈ నెల 15 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమ వివరాలను కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. 11న సాయంత్రం 6 గంటల నుంచి వివిధ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, అఖండ దీపారాధన, పంచగవ్య ప్రాశన, రుత్వీకరణ, రక్షాబంధనం, మృత్యంగ్రహణ, అంకురార్పణ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, ఆరాధన, అనంతర అగ్నిప్రతిష్టాపన, మూర్తి కుంభ ఆవాహన, ధ్వజారోహణ, పెండ్లికుమారుడి చేయుట తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 13వ తేదీన శ్రీస్వామివారి కల్యాణ మహోత్సవం, తదనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు తమ పేర్లను ఆలయంలో నమోదు చేయించుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు పుట్టబాబు కోరారు. 14, 15 తేదీల్లో విశేషపూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్టబాబు, కమిటీ సభ్యులు కోరారు. 


logo