నేడు గొంతెమ్మ గుట్టపై లక్ష్మీదేవర జాతర

- వైభవంగా పాండవుల భేరిపై పెద్ద పట్నం
కాటారం, ఫిబ్రవరి 6 : నాయకపోడు తెగకు చెందిన వారు అనాదిగా జరుపుకునే గొంతమ్మ లక్ష్మీదేవర జాతరకు మండలంలోని ప్రతాపగిరి కోట, గొంతెమ్మ గుట్ట ముస్తాబైంది. ఆదివారం జరుగనున్న ఈ జాతరకు జిల్లాలోని అటవీ గ్రామాల నుంచి నాయకపోడు తెగకు చెందిన వారే గాకుండా ఇతర భక్తులు సైతం ప్రతాపగిరి గుట్ట బాటపడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం వర్షాలు కురవక ప్రజలు అల్లాడుతున్న సమయంలో గొంతెమ్మ గుట్ట పైకి వెళ్లి మొక్కులు ముట్టజెప్పి దేవతను కొలిచాక... వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాంతం పాడిపంటలతో కళకళలాడిందని చెప్పుకుంటారు. ఇదే విశ్వాసంతో ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల ప్రజలు లక్ష్మీదేవరలు, శివసత్తులు, పాండవ దేవుళ్లను గుట్టపైకి తీసుకువచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా పాండవ దేవతలను కొలిచే బేరి(వేదిక) ఉంది.
సందడిగా గొంతెమ్మ గుట్ట...
ప్రతాపగిరి కోటలోని గొంతెమ్మ గుడి, పాండవుల డేరా వద్ద మూడు రోజుల పాటు జరిగే జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు, భక్తులు తరలివస్తున్నారు. గుట్టపై గల గొంతెమ్మ కొల్లు గుంట, పాండవుల డేరా, పాండవుల భేరి, గొంతెమ్మ దొనబండల గుడి, శ్రీకృష్ణుని పాదాలు, గుడి వెనుక రాతిపై చెక్కిన లక్ష్మీదేవర చిత్రం, పాండవుల పాదముద్రలను దర్శించుకుంటున్నారు. కాగా, శనివారం గొంతెమ్మ గుడి వద్ద రాతిపై ఉన్న దేవతామూర్తులకు గోదావరి జలంతో అభిషేకాలు నిర్వహించారు. సా యంత్రం ప్రతాపగిరి అంతర కోటలో పాండవుల డేరాలో, నీలగిరి స్తంభం పై ఆంజనేయుని జెండా ఎగురవేసి, మువ్వ తగిలించి 12 టంబాల పందిరుల కింద లక్ష్మీదేవరను ప్రతిష్ఠించారు. అలాగే మేళతాళాలు, డప్పు చప్పుళ్ల మధ్య నడిజాము రాత్రి తర్వాత తొలి గడియల్లో పాండవుల భేరి వద్ద పెద్దపట్నం వేసినట్లు జాతర నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు