సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 12, 2021 , 02:53:25

సైడ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభం

సైడ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభం

భూపాలపల్లి రూరల్‌, జనవరి11: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్దు అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు శుభాష్‌కాలనీలో స్థానిక వార్డు సభ్యుడు ముంజంపెల్లి మురళీధర్‌ అధ్యక్షతన పట్టణ అభివృద్ధి పనులు ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ హాజరై సైడ్‌ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, అర్బన్‌ పెసిడెంట్‌ క్యాతరాజు సాంబమూర్తి, వార్డు కౌన్సిలర్లు, ముంజాల రవీందర్‌, జక్కం రవి, నూనె రాజు, పానుగంటి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo