పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 23 : రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. బుధవారం ఆయన మండలంలోని అటవీ గ్రామాల్లో పర్యటించారు. కమలాపూర్, రాంపూర్, ఆజంనగర్, నాగారం గ్రామాల్లో జీపీ భవనాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆజంనగర్‌లో పెరిక కులస్తుల కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాగారం గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సర్పంచ్ పిన్నింటి రాజిరెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పామాయిల్ పంట సాగును ఎంచుకోవాలన్నారు. ఒక్కసారి పంట వేస్తే ఏళ్ల తరబడి లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. పంటను మీ వద్దకే వచ్చి కొనుగోలు చేసి అకౌంట్లలో డబ్బులు జమచేస్తారని అన్నారు. అలాగే అంతర్పంటగా శ్రీగంధం వేసి అదనంగా లాభాలు పొందాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు వేదికలు నిర్మించారని తెలిపారు. ఈ వేదికలు రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ఆగ్రోస్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి కలెక్టరేట్ : ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఆగ్రోస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీపై అందజేసే విత్తనాలు, ఎరువులను, కొనుగోలు చేసి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారఘుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్, అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్‌లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?