Vivo V30e | మే 2న వివో వీ30ఈ లాంఛ్ : ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
Vivo V30e : వచ్చే నెల తొలి వారంలో భారత్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్టు వివో వెల్లడించింది. కంపెనీ ఇటీవలే బడ్జెట్ వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసింది.
Vivo V30e : వచ్చే నెల తొలి వారంలో భారత్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్టు వివో వెల్లడించింది. కంపెనీ ఇటీవలే బడ్జెట్ వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఇక అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ వివో వీ30ఈ విసిరీస్ లైనప్ వివో వీ30, వివో వీ30 ప్రొ స్మార్ట్ఫోన్ల సరసన నిలవనుంది. గత ఏడాది ఆగస్ట్‌లో లాంఛ్ అయిన వివో వీ29ఈకి కొనసాగింపుగా వివో వీ30ఈ భారత్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
లేటెస్ట్ వివో స్మార్ట్‌ఫోన్ మే 2 మధ్యాహ్నం 12 గంటలకు లాంఛ్ కానుందని కంపెనీ తెలిపింది. లాంఛ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్ ఫీచర్లకు సంబంధించి పలు వివరాలు లీక్ అయ్యాయి. ఇక వివో వీ30ఈ ధరను వివో ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. వివో వీ29ఈ రూ. 26,999 నుంచి రూ. 28999 మధ్య అందుబాటులో ఉండటంతో వివో వీ30ఈ ఇంచుమించు ఈ ధరకు అటూఇటుగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇక వివో వీ30ఈ ఫ్లిప్‌కార్ట్, వివో.కాంతో పాటు కంపెనీ ఆఫ్‌లైన్ అధీకృత భాగస్వాముల వద్ద లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..వీ30ఈ సర్క్యులర్ కెమెరా సెటప్‌తో డ్యూయల్ లెన్సెస్, ఫ్లాష్ ల్యుమినస్ రింగ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. కర్వ్డ్ 3డీ డిస్ప్లే, స్లిమ్ ప్రొఫైల్, 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో థిన్నెస్ట్ ఫోన్‌గా వివో వీ30ఈ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. రియర్ కెమెరా కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్, ఐకానిక్ ఆరా లైట్ ఫీచర్‌తో ఈ ఫోన్ రానుంది. ఇక వీ30ఈ బ్లూగ్రీన్, బ్రౌన్ రెడ్ కలర్ వేరియంట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
Read More :
Priyanka Chopra | ‘టైగర్’తో నా కల నెరవేరింది : ప్రియాంక చోప్రా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

