జనగామ చౌరస్తా : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటకాన్ ఆధ్వర్యంలో జరిగిన 24వ జాతీయ స్థాయి కుంగ్ ఫూ అండ్ కరాటే పోటీల్లో జనగామ న్యూస్టార్ చైనీస్ కుంగ్ ఫూ విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ బెల్ట్ సాధించారని గ్రాండ్ మాస్టర్ ఎండీ సలీం పాషా తెలిపారు. 14 సంవత్సరాల విభాగంలో గోల్డ్ మెడల్‌ను బజాజ్ నిషాత్, సిల్వర్ బెల్ట్ సుశాంత్, బబ్లూ సాధించగా, 10 సంవత్సరాల విభాగంలో గోల్డ్ మెడల్‌ను మనస్విని, సబా, స్వప్న, నందిని, దైవిక్, యాహియా, అఖిల్ పాషా, విశ్వా, నక్షత్ర, అభినవ్ శ్రీరామ్, అభినవ్ కైవసం చేసుకున్నారు. విజేతలకు ప్రముఖ సినీ హీరో మాస్టర్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూస్టార్ చైనీస్ కుంగ్ ఫూ స్టేట్ జనరల్ సెక్రెటరి గుగ్గిల్ల దేవేందర్ పాల్గొన్నారు.