సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన

- గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ
- స్వచ్ఛందంగా చేరుతున్న మహిళలు
జనగామ రూరల్, ఫిబ్రవరి 20 : మండలంలోని పెంబర్తి, చౌడారం గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నది. శనివారం పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండడంతో ప్రజలు ఆదరిస్తున్నారని నాయకులు తెలిపారు. అనేక మంది స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు అంబాల ఆంజనేయులు, ముక్క రాజయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినబోయిన నర్సయ్య, దండేబోయిన రమేశ్, జడ్పీటీసీ నిమ్మతి దీపికామహేందర్రెడ్డి, జిల్లా నాయకులు బాల్దె సిద్ధిలింగం, ఎంపీటీసీ మూల రవి, మాజీ సర్పంచ్ సలేంద్ర కొమురయ్య, మాజీ ఎంపీటీసీ మోత్కూరీ కావ్యశ్రీకిషన్, మాజీ ఉప సర్పంచ్ మునిగే పరశురాములు, మంద లక్ష్మణ్, యువజన నాయకులు యాసారపు ప్రవీణ్‌కుమార్, చంద్రమౌళి, చెరుకూరి సిద్ధిరాములు, బండ రాములు, కొండబోయిన రాజుయాదవ్, ఆకుల శ్రవణ్, ఆత్మకూరి శ్రీనివాస్, గోదెల వంశీధర్‌రెడ్డి, సాయిమల్లయ్య, గొలుసుల ఎల్లయ్య, వార్డు సభ్యులు గంగరబోయిన కవితాకరుణాకర్, ఎండీ రజాక్, బండ వెంకటేశ్, బుడిగె శ్రీనివాస్, గోనెల సంపత్, ఆంజనేయులు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
నీర్మాలలో టీఆర్ఎస్ సభ్యత్వం
తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు
దేవరుప్పుల : మండలంలోని నీర్మాలలో శనివారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినట్లు పార్టీ గ్రామశాఖ కార్యదర్శి మేడ విద్యాసాగర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నల్ల రాములు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ మేడ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధుసమితి గ్రామ కోఆర్డినేటర్ దయాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు శివారెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా సభ్యత్వాల స్వీకరణ
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పంధన లభించిందని పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు సభ్యత్వాలను స్వీకరించారు. రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరిపల్లి రామల్లు, గోనెల ఉప్పలయ్య, చాట్ల రాజు, ఊరడి లిం గం, గట్టు వెంకటస్వామి, సింగపురం రమేశ్‌కుమార్, సింగపురం కమలాకర్, గాండ్ల శోభన్‌బాబు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఉగ్రవాదానికి మూలకారకులు వారే : భద్రతా మండలిలో ఇండియా
- దీదీకి నడ్డా కౌంటర్ : అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు