జనగామ-హుస్నాబాద్ రోడ్డుకు ఇరువైపులా తెల్లాపూర్ నర్సరీ మొక్కలు

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 24 : సీఎం కేసీఆర్ లక్ష్యానికనుగుణంగా జనగామ-హుస్నాబాద్ మార్గంలో ఆర్అండ్బీ సరిహద్దుల్లో ఇరువైపులా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా మొక్కల కొరత ఉండడంతో ఆదివారం హైదరాబాద్లోని తెల్లాపూర్ నర్సరీ నుంచి అవసరమైన మొక్కలను ఆయన లారీలో లోడ్ చేయించి పంపించారు. వడ్లకొండ, నర్మెట, తరిగొప్పుల వరకు జనగామ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సుమారు 54 కిలోమీటర్ల రహదారికి ముత్తిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సరిహద్దులు ఖరారు చేయించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఆయా గ్రామాల కూలీలతో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నారు. జిల్లాలోని నర్సరీల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కొరత ఉండడంతో డీఆర్డీవో అధికారుల ద్వారా తెల్లాపూర్ నర్సరీ అధికారులను సంప్రదించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దగ్గరుండి లారీల్లో మొక్కలను తరలించారు.
తాజావార్తలు
- భారత విద్యుత్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్