పాలకుర్తి పట్టణ అభివృద్ధికి మంత్రి ఎర్రబెల్లి కృషి

- ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అభివృద్ధి పనులపై చర్చ
పాలకుర్తి రూరల్ జనవరి 12 : పాలకుర్తి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి చేస్తున్నారని ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అన్నారు. మంగళవారం సర్పంచ్ వీరమనేని యాకాంతారావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ పాలకుర్తి పట్టణ అభివృద్ధికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.22 కోట్లు మంజూరు చేశారన్నారు. డీఎంఎల్టీ ఫండ్ నుంచి రూ.2 కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తో పాటు ఆరులైన్ల రోడ్ల విస్తరణ పనులు చేపట్టామన్నారు. సీసీ రోడ్లకు రూ. కోటి 20 లక్షలు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి ఎండీ నూరొద్దీన్, ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్, ఎంపీవో దయాకర్, ఏపీవో మంజుల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఏఈలు పాషా, ప్రశాంతి, ఉపసర్పంచ్ చంద్రబాబు, ఎంపీటీసీ ఎడవెల్లి పురుషోత్తం, కో ఆప్షన్ సభ్యురాలు సలేంద్ర రమసోమన్న, పంచాయతీ కార్యదర్శి మనోహరస్వామి పాల్గొన్నారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీడీవో
దేవరుప్పుల : దీర్ఘకాలిక సమస్యలను గ్రామసభలో చర్చించి పరిష్కరిస్తున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని పెదమడూరులో నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్ ఆకవరం సుజనారెడ్డి అధ్యక్షత వహించగా ప్రత్యేకాధికారి, ఈజీఎస్ ఏపీడీ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ దళిత కాలనీలోని మురుగునీరు పైవేటు స్థలంలో నిలిచి దుర్వాసన వస్తున్నదనే ఫిర్యాదు నేపథ్యంలో సమీపంలోని వాటర్ ట్యాంకు వద్దనే ఇంకుడు గుంతలు నిర్మించి, అందులోకి మళ్లించాలని తీర్మానించినట్టు తెలిపారు. గ్రామపంచాయతీకి వాటర్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తికి దీర్ఘకాలికంగా జీతం బకా యి ఉండగా, అతనికి జీపీ నిధుల నుంచి రూ.లక్ష చెల్లించాలని తీర్మానం చేశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గిరి, ఉపసర్పంచ్ వెంకటేశ్, రైతుబంధు గ్రామ కో-ఆర్డినేటర్ పెద్దారెడ్డి, పీఆర్ ఏఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్సై
బచ్చన్నపేట : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై జలగం లక్ష్మణ్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కొన్నెలో సర్పంచ్ వేముల వెంకట్‌గౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సీసీ కెమెరాలతో గుర్తుపట్టొచ్చన్నారు. కొన్నె గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కురుమసంఘం రూ.10 వేలు, ముదిరాజ్ సంఘం రూ.10 వేలు, రెడ్డి సంఘం రూ.10 వేలు, వైశ్య సంఘం రూ.10 వేలు, గౌడ సంఘం రూ.10 వేలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి, నాయకులు శివకుమార్, అంజయ్య, కొండ రాజు, సిద్ధిరాములు, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, రమేశ్, ఇస్తారి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్‌పై లైంగిక దాడి!
- లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత