చెడుపై విజయానికి నిదర్శనం దసరా వేడుకలు
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామలో ఘనంగా రావణవధ
స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
జనగామ చౌరస్తా/జనగామ రూరల్, అక్టోబర్ 16 : చెడుపై విజయానికి నిదర్శనం దసరా వేడుకలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఒకరినొకరు సేవాభావంతో ఐక్యంగా నిలువాలని పిలుపునిచ్చారు. విజయదశమి వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో నిర్వహించిన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా పండుగను నిర్వహించుకోవాలని, అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. విజయ దశమికి నిదర్శనంగా చెడును వదిలి మంచిని స్వీకరించాలని కోరారు. అనంతరం రావణ వధను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమాణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు వాంకుడోత్ అనిత, పగిడిపాటి సుధాసుగుణాకర్ రాజు, బండ పద్మ యాదగిరిరెడ్డి, తాళ్ల సురేశ్‌రెడ్డి, ముస్య్తాల దయాకర్, సమద్, నాయకులు బండ యాదగిరిరెడ్డి, ఉడుగుల నర్సింహులు, చెంచారపు పల్లవి, జిట్ట శ్రీశైలం, పోకల లింగయ్య, ఉల్లెంగుల నర్సింగ్, గజ్జెల నర్సిరెడ్డి, చారబుడ్ల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ నిర్వహించారు. గ్రామాల్లో జమ్మిచెట్లకు పూజలు నిర్వహించి పాలపిట్టను దర్శించుకున్నారు. పలుచోట్ల రావణాసుర వధను ఘనంగా నిర్వహించారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో…
స్టేషన్ ఘన్పూర్ : మండలంలో దసరా ఉత్సవాలను శుక్రవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు దసరా ఉత్సవాలకు హాజరై ప్రజలతో కలిసి వేడుకలు నిర్వహించారు. సాయంత్రం డప్పు చప్పుల్లతో ఊరు శివారులో పాలపిట్టను దర్శించుకున్న ప్రజలు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దసరా పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జమ్మి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్‌కుమార్, టీర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, జఫర్‌గఢ్ ఎంపీపీ రడపాక సుదర్శన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో రావణ వధ..
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లో బొడ్రాయిల వద్ద, గడి బురుజుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రధాన కూడళ్లు, పాఠశాల అవరణలో జమ్మి కొమ్మలకు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకులు అందించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రావణవధ నిర్వహించారు. కేశిరెడ్డిపల్లిలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో రావణవధ కొనసాగించారు. అన్ని గ్రామాల్లో దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్సై జలగం లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. మండల కేంద్రంలోని అంజయ్యనగర్‌లో నిర్వహించిన జమ్మిపూజలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారి వేముల శివప్రసాద్, ఆయన సతీమణి కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ శృతి పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొండి వెంకట్‌రెడ్డి, గట్టు మంజులామల్లేశం, అరుణాఐలయ్య, సిద్ధ్దారెడ్డి, ఫిరోజ్, మల్లవరం వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల బాలరాజు, గణపురం అనంద్ పాల్గొన్నారు. అనంతరం కేశిరెడ్డిపల్లిలో శోభాయాత్ర నిర్వహించారు.