e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జగిత్యాల హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే

హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే

హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే

తల్లి లాంటి టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసిన ఈటల రాజేందర్‌
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

ఇల్లందకుంట, జూన్‌ 24: రానున్న ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కన్నతల్లి లాంటి టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసిన మోసగాడు ఈటల అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ దయతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు మంత్రి పదవి చేపట్టి రూ.వేల కోట్లు వెనుకేసుకుని వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు. ధర్మం పేరు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేసే బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీలకు దోచిపెడుతున్న, రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న బీజేపీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఈటల లాంటి నమ్మక ద్రోహుల నుంచి ప్రజలు విముక్తి పొందుతున్నారని పేర్కొన్నారు. పల్లె ప్రగతి పథకంలో గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చిల్లర రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై మాట్లాడేపుడు ఈటల నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంస్వరణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ బుర్ర రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కనుమల్ల గణపతి, బీర్ల కుమార్‌, ఎండీ ముస్తఫా, రాజీర్‌, స్వామి, రాజబాబు, ఎల్లయ్య తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే
హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే
హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే

ట్రెండింగ్‌

Advertisement