e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home కరీంనగర్ పల్లెల్లో బోనాల వేడుకలు

పల్లెల్లో బోనాల వేడుకలు

పల్లెల్లో బోనాల వేడుకలు

జగిత్యాల రూరల్‌, జూలై 11: కల్లెడ గ్రామంలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికో బోనం చొప్పున నెత్తిన పెట్టుకొని గ్రామంలోని పుర వీధుల గుండా డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో సందీప్‌రావు, మహేశ్వర్‌రావు, సత్యనారాయణరావు, ఆనంద రావు, దయాకర్‌రావు, రజిత, అరుణ, లత, మాధవి, కల్యాణ్‌, కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల మండలకేంద్రంలో
కొడిమ్యాల, జూలై 11: మండలకేంద్రంలో అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికో బోనం చొప్పున డప్పుచప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకెళ్లి మొక్కులు చెల్లించారు. నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కొత్తూరి స్వామి, మాంకాళి స్వామి, కొత్తూరి దేవయ్య, చిట్వాల స్వామి, కొలాపూరి శంకర్‌, లక్ష్మీరాజం, గంగయ్య, లక్ష్మణ్‌ తదితరులున్నారు.
చింతకుంట గ్రామంలో
కథలాపూర్‌, జూలై 11: చింతకుంట గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. పోచమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వన భోజనాలు చేసి ఆటపాటలతో సరదగా గడిపారు.
దమ్మన్నపేట గ్రామంలో
మేడిపల్లి, జూలై 11: దమ్మన్నపేట గ్రామంలో శ్రీమహాలక్ష్మీ, తాతమ్మ, పెద్దమ్మ, పోచమ్మ గ్రామదేవతలకు ఘనంగా పూజ లు నిర్వహించారు. భక్తులు గ్రామదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు బండ్ల గంగాధర్‌, బండ్ల నరేశ్‌, బండ్ల ధనంజయ, బండ్ల మురళి, తోట రాజరాం, అల్లె రమేశ్‌, మర్రి భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
యూసుఫ్‌నగర్‌ గ్రామంలో
కోరుట్ల రూరల్‌, జూలై 11: యూసుఫ్‌నగర్‌లో గ్రామ దేవతలు మారెమ్మ, గుండేలమ్మకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుగ్గిళ్ల తుకారాం గౌడ్‌, ఎంపీటీసీ గుగ్గిళ్ల ప్రియాంక, ఆయా కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లెల్లో బోనాల వేడుకలు
పల్లెల్లో బోనాల వేడుకలు
పల్లెల్లో బోనాల వేడుకలు

ట్రెండింగ్‌

Advertisement