Zohrani Mamdani | అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో (local elections) కీలకమైన న్యూయార్క్ నగర (New York City) మేయర్ పదవిని మమ్దానీ కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్‌గానూ చరిత్ర సృష్టించారు. ఇక విజయానంతరం మమ్దానీ మాట్లాడారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విక్టరీ స్పీచ్ (victory speech)లో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు.
VIDEO | USA: “I am young, I am Muslim, I am a democratic socialist and most damning of all I refuse to apologise for any of this”, says Zohran Mamdani (@ZohranKMamdani) after winning New York mayoral election.
(Source: AFP)#NYC
(Full video available on PTI Videos -… pic.twitter.com/lPUUfqobwJ
— Press Trust of India (@PTI_News) November 5, 2025
‘మనం పాత తరం నుంచి కొత్తతరంలోకి అడుగపెట్టే క్షణం చరిత్రలో చాలా అరుదుగా వస్తుంది. న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మనం ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చేశాం’ అని అన్నారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థి, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.
అంతేకాదు నేరుగా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్.. ఇదంతా మీరు చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నా వద్ద నాలుగు మాటలు ఉన్నాయి. సౌండ్ పెంచండి. మీరు మాలో ఎవరినైనా చేరుకోవాలంటే మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అక్కడ ‘జోహ్రాన్, జోహ్రాన్, జోహ్రాన్..’ నినాదాలు మార్మోగాయి.
Mamdani: “Donald Trump, since I know you’re watching, I have four words for you: Turn the volume up.”#Mamdani #zohranfornyc pic.twitter.com/1NKUWSoBO2
— Naushad Alam Alig (@NaushadMahi) November 5, 2025
మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు.
#MustWatch 🚨#ZohranMamdani quote the Greatest Prime minister of India Pandit Jawahrlal Nehru Ji on Victory Speech ❤️👏 pic.twitter.com/JMSl0ZAw8h
— Ashish Singh (@AshishSinghKiJi) November 5, 2025
Also Read..
Zohran Mamdani | అమెరికాలో భారత సంతతి హవా.. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయం
Ghazala Hashmi | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ