సోమవారం 25 జనవరి 2021
International - Jan 06, 2021 , 01:58:04

తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరు

తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరు

హరారే (జింబాబ్వే): ‘ఆడది అబల కాదు సబల’ అన్న నానుడిని ఓ 17 ఏండ్ల చిన్నది చేతల్లో చేసి చూపిస్తున్నది. ఆఫ్రికా దేశం జింబాబ్వేలో బాల్య వివాహాలు ఎక్కువ. పేదరికంలో మగ్గే ముకుపచ్చలారని ఆడ పిల్లలను ధనికులు, వయో వృద్ధులు సంప్రదాయం, మతం పేరుతో డబ్బు చెల్లించి బాల్య వివాహాలు చేసుకుంటారు. పెండ్లి చేసుకోవడానికి ఆడబిడ్డలు, వారి తల్లిదండ్రులు అడ్డుచెబితే దాడులకు పాల్పడుతారు. ఈ క్రమంలో ఆ దేశంలో బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. దీన్ని గమనించిన నట్సిరైషే మరిత్సా అనే 17 ఏండ్ల అమ్మాయి.. పెండ్లికాని బాలికలకు, పైండ్లె గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ‘తైక్వాండో’ మార్షల్‌ ఆర్ట్‌ను నేర్పిస్తున్నది. రాజధాని హరారేకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి ప్రాంగణంలో రోజూ ఈ శిక్షణనిస్తున్నది. 


logo