Donald Trump | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకొన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కృతజ్ఞత లేదని విమర్శించారు. చిన్నారి నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్స్కీ తీసుకొన్నారని వ్యాఖ్యానించారు.
‘చిన్నారి నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా బైడెన్ సర్కారు (Joe Biden) నుంచి జెలెన్స్కీ సొమ్ములు తీసుకున్నారు. అతడికి (జెలెన్స్కీ) 350 బిలియన్లు ఇచ్చాము. యూఎస్ నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్నా జెలెన్స్కీకి కృతజ్ఞత లేదు’ అని ఆరోపించారు. ఇక రష్యా విషయంలో అత్యంత కఠినంగా ఉన్న అధ్యక్షుడిని తానే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా విషయంలో తనకంటే కఠినంగా ఎవరూ లేరని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read..
IIFA Awards 2025 | ఐఫాలో లాపతా లేడీస్ సంచలనం.. ఏకంగా పది అవార్డులు కైవసం
Lalit Modi | లలిత్ మోదీకి షాక్.. పాస్పోర్ట్ రద్దు చేయాలంటూ వనౌట్ ప్రధాని ఆదేశం