న్యూఢిల్లీ : పాకిస్థాన్ తరఫున గూఢచర్యానికి పాల్పడుతూ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇలాంటిదే మరో ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో యూట్యూబర్ వసీం అక్రమ్, అతడి సహాయకుడు తౌఫిక్లను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
దర్యాప్తులో అసక్తికర విషయం బయటపడింది. పాకిస్థాన్‌కు వీసాలు సమకూర్చుతామం టూ నిందితులు ఇద్దరూ పలువురి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అందులోని ప్రధాన భాగం పాకిస్థాన్ హై కమిషన్ (పీహెచ్సీ) అధికారులకు చేరుతున్నదని, ఐఎస్ఐ ఏజెంట్స్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ఆ డబ్బుల్ని వీసా డెస్క్ ఉపయోగిస్తున్న సంగతి బయటపడింది.