Pakistani Army | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన యూట్యూబ్ ఛానెల్ (YouTube Channel)ని కూడా నిలిపివేసింది. దాడి తర్వాత భారత్‌పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి అరికట్టడంలో భాగంగా భారత్ ఈ చర్య చేపట్టింది.
గత నెల 22న పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించినట్లు తెలిసింది.
అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. జమ్ము కశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో భారత్ చర్యలు చేపడుతోంది.
ఈనెల 22న మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్ చేసింది. పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేసింది.
Also Read..
Instagram | పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ సెలబ్రిటీల ఇన్‌స్టా అకౌంట్స్ బ్యాన్
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన
Lashkar commander | లష్కరే కమాండర్ సయూద్‌కు పాక్ ప్రభుత్వ భద్రత.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు