Instagram | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతీయులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాక్‌కి ఖళ్లెం వేసేందుకు భారత ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఇప్పటికే పాక్ నటులు, వారి సినిమాలపై బ్యాన్ విధించిన ప్రభుత్వం ఇక నుండి వారి సోషల్ మీడియా ఖాతాలని ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిరా ఖాన్ , హనియా అమీర్ , సనమ్ సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్ర అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ వంటి సెలబ్రిటీలకు సంబంధించి ఇన్ స్టా ఖాతాలను ఇండియాలో బ్యాన్ చేశారు. ఇండియాలో వీరి పేజ్ ఎవరైన యాక్సెస్ చేయాలని ప్రయత్నిస్తే.. ఇండియాలో ఈ ఖాతా అందుబాటులో లేదు, ఈ కంటెంట్ పరిమితం చేయాలనే చట్టపరమైన ఆదేశాలతో ఇలా చేశాం అనే మెసేజ్ వస్తుంది.
పాక్ నటులు, వారి సినిమాలు, పాక్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లని సైతం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. పాక్‌కి చెందిన దాదాపు 16 ఛానల్స్‌పై వేటు వేసింది.. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానల్స్, కొందరు జర్నలిస్టుల సోషల్ మీడియా అకౌంట్స్, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్ ప్రసారాలు అన్ని కూడా ఇక ఇండియాలో చూసేందుకు వీలు ఉండదు. ఇవి ఎవరైన ఓపెన్ చేస్తే.. ఈ కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని మెసేజ్ వస్తుంది.
భారత్‌కి వ్యతిరేఖంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నిత కంటెంట్, తప్పుదోవ పట్టించే స్స్టోరీలని ప్రసారం చేస్తున్న క్రమంలో పలు యూట్యూబ్ ఛానెల్స్‌ని బ్యాట్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు భారత్‌లో నటించడం మానేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ అబీర్ గులాల్ చిత్రంలో నటించారు. అయితే మే 9న థియేటర్లలోకి విడుదలకి సిద్ధం కాగా, దానిపై బ్యాన్ విధించారు.