Today history: ప్రపంచ ప్రఖ్యాత కవి మీర్జా గాలిబ్ 1797 లో సరిగ్గా ఇదే రోజున ఆగ్రాలో జన్మించారు. ఈయన అసలు పేరు మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్. అతడి కలం పేరు మీర్జా గాలిబ్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందుస్తానీ ప్రజల్లో కూడా గాలిబ్ ప్రసిద్ధి చెందారు. ఈయనకు ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషల్లో పరిజ్ఞానం ఉండేది. ఉర్దూ, పర్షియన్ రెండింటిలోనూ కవిత్వం, గజల్స్ రాశారు.
మీర్జా గాలిబ్ తాత ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు. 13 సంవత్సరాల వయస్సులో నవాబ్ ఇలాహి బక్ష్ కుమార్తె ఉమ్రావ్ బేగంతో గాలిబ్ వివాహం జరిగింది. పెండ్లయ్యాక ఢిల్లీ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గాలిబ్‌కు ఏడుగురు పిల్లలు. కానీ ఎవరూ రెండేండ్ల కంటే ఎక్కువ జీవించలేరు. తన వివాహాన్ని జీవితంలో రెండవ జైలుగా తన ఒక లేఖలో గాలిబ్ పేర్కొన్నాడంటే ఎంత స్వేచ్ఛను కోల్పోయాడో అర్థమవుతుందని చెప్తుంటారు చరిత్రకారులు. మీర్జా గాలిబ్ తన రచనల్లో మొఘల్ సామ్రాజ్యం క్షీణత, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు, 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం వంటి సంఘటనలన్నింటినీ ప్రస్తావించారు.
ఈయనకు మద్యం సేవించడమంటే ఎంతో మక్కువ ఉండేదని చెప్తుంటారు. ఖరీదైన మద్యం కోసం ఎంత దూరమైనా వెళ్లేవారని పలువురు చరిత్రకారులు తెలిపారు. ఒకసారి నమాజ్ చేస్తుండగా ఓ స్నేహితుడు మద్యం తీసుకుని వచ్చానని చెప్పడంతో నమాజ్ మధ్యలోనే నిలిపి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే ఉన్న ఓ పెద్దాయన ‘ఇదేంటి నమాజ్ చేయకుండా మధ్యలో వెళ్లిపోతున్నావ్’ అని ప్రశ్నించగా.. ‘నేను దేని కోసం ప్రార్థించానో.. దాన్ని పొందాను.. అందుకే వెళ్లిపోతున్నా’ అని సమాధానమిచ్చాడంట. మీర్జా గాలిబ్ ధనవంతుడే అయినప్పటికీ.. అతడి నవాబీ అభిరుచి అతడ్ని అప్పుల్లో ముంచెత్తింది. అప్పట్లో రూ.40 వేలకు పైగా అప్పులు ఉండేవని చెప్తుంటారు. అప్పు చెల్లించనందుకు ఒకసారి గాలిబ్‌ను అరెస్ట్ కూడా చేసినట్లు చరిత్ర చెప్తున్నది.
2008 : వీ శాంతారాం ఉత్తమ చిత్రం అవార్డు గెల్చుకున్న ఆమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’
2007 : బాంబు పేలుడులో పాకిస్థాన్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో దుర్మరణం
2000 : పెండ్లికి ముందు సంబంధాలను చట్టబద్ధం చేసిన ఆస్ట్రేలియా
1975 : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ చస్నాలా బొగ్గు గనిలో ప్రమాదం, 372 మంది దుర్మరణం
1965 : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జననం
1960 : ఆఫ్రీకాలోని సహారా ఎడారిలో మూడో అణు పరీక్ష నిర్వహించిన ఫ్రాన్స్
1939 : టర్కీలో భూకంపం, దాదాపు 40 వేల మంది దుర్మరణం
1911 : కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించిన ‘జన గణ మన’ గీతం
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..