Omicron variant | ‘ఒమిక్రాన్’తో ప్రపంచానికి తీవ్ర ముప్పు ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) హెచ్చరించింది. ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో పలు ఉత్పరివర్తనాలు జరిగాయని, ఫలితంగా రోగనిరోధక శక్తి నుంచి ఇది సులభంగా తప్పించుకోగలిగే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరోసారి కరోనా విజృంభిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఇప్పటివరకూ ఈ వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది. వైరస్ నియంత్రణకు సోమవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇప్పటికే 13 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ తాజాగా స్కాట్లాండ్, పోర్చుగల్, డెన్మార్క్, ఫ్రాన్స్‌కి కూడా వ్యాపించింది. మరోవైపు, కొత్త వేరియంట్ భయాలు, డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలతో జపాన్, ఆస్ట్రేలియా సరిహద్దులను పూర్తిగా మాసేశాయి.
దేశంలో ఇప్పటివరకైతే ఒమిక్రాన్ వేరియం ట్ ఉనికిని కనుగొనలేదని సోమవారం అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల మహారాష్ట్రకు వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచామని, అతని నమూనాలను ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల బెంగళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి నమూనాను పరిశీలించామని, అయితే అది డెల్టా వేరియంట్ మాత్రం కాదని కర్ణాటక ఆరోగ్యశాఖమంత్రి సుధాకర్ సోమవారం తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు ఇటీవల వచ్చిన మహిళలో ఎటువంటి కరోనా లక్షణాలు గుర్తించలేదని అధికారులు తెలిపారు.
సాధారణ క్లాత్ మాస్కులు కూడా కరోనా వైరస్ నుంచి సమర్థంగా రక్షణ కల్పించేలా గువాహటి ఐఐటీ పరిశోధకులు కోటింగ్(పూత)ను తయారు చేశారు. క్లాత్ మాస్కులకు ఈ కోటింగ్ పూస్తే గాలి ద్వారా సోకే వైరస్ నుంచి ఎక్కువ రక్షణ ఉంటుందని, ఖర్చు కూడా తక్కువని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ మాస్కులతో ఊపిరి తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు. అయితే మిగతా వేరియంట్లతో పోల్చితే లక్షణాలు భిన్నంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ వేరియంట్ సోకిన వారిలో విపరీతమైన అలసట, ఒళ్లునొప్పులు, తల నొప్పి, దగ్గు, గొంతులో గరగర ఉంటున్నట్టు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
ఒమిక్రాన్ భయం.. బూస్టర్ డోస్ వేసుకోవాలా? ఇది కరోనా కొత్త వేరియంట్ నుంచి రక్షిస్తుందా?
Omicron : తొలిసారి ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించింది ఎవరో తెలుసా?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?