Omicron : తొలిసారి ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించింది ఎవరో తెలుసా?
తొలిసారి ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించింది ఎవరో తెలుసా? | ప్రస్తుతం ప్రపంచమంతా మరోసారి భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దానికి కారణం.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.
ప్రస్తుతం ప్రపంచమంతా మరోసారి భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దానికి కారణం.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. దీనికి ముందుగా బీ.1.1.529 అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ దానికి ఒమిక్రాన్ అనే పేరు పెట్టింది. నవంబర్ 25న కొత్త వేరియంట్ గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు ప్రపంచానికి తెలియజేశారు.

ఒమిక్రాన్ వైరస్‌ను మొదటగా గుర్తించింది మాత్రం సౌతాఫ్రికాకు చెందిన డాక్టర్ ఆంగెలిక్యూ కొయెట్జీ. తను సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం ఓ 30 మంది వ్యక్తులకు కరోనా సోకిందట. కానీ.. అది అప్పటి వరకు ఉన్న ఏ వేరియంట్‌తోనూ సరిపోలలేదట. దీంతో తనకు అనుమానం వచ్చి ఆ వైరస్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్‌లో ఆ వైరస్‌ను పరీక్షించిన సైంటిస్టులు.. అది కొత్త వేరియంట్ అని.. కరోనా మ్యూటేషన్ చెందగా ఏర్పడిన కొత్త వేరియంట్ అని స్పష్టం చేశారు. అది బీ.1.1.529 అంటూ ప్రకటించారు.
ఆ వైరస్.. డెల్టా వైరస్ కంటే డేంజరస్ అని అంతా భావించారు. దాని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని సైంటిస్టులు అనుమానించారు. అయితే.. మొదటగా ఆ వైరస్ వ్యాప్తి చెందిన 30 మంది పేషెంట్లలో ఎవ్వరికి కూడా తీవ్రమైన లక్షణాలు లేవని డాక్టర్ అంగెలిక్యూ స్పష్టం చేశారు.
వాళ్లలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వారే. సగం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. వాళ్లలో కొందరికి స్వల్పంగా ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఇంకొందరిలో మాత్రం జ్వరం కనిపించింది అని ఆమె తెలిపారు.
వాళ్లలోని లక్షణాలను బట్టి చూస్తే.. ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ సోకడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే.. ఆ వైరస్ సోకిన వాళ్లు ఆసుపత్రికి వెళ్లకుండానే ఆ వైరస్ బారి నుంచి బయట పడ్డారు అని డాక్టర్ ఆంగెలిక్యూ కొయెట్జీ వెల్లడించారు.
అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ ముట్యేషన్ చెందుతూ తన రూపాన్ని మార్చుకొని వ్యాప్తి చెందుతుండటం వల్ల వైరస్ సోకిన వాళ్లలో ఒక్కొక్కరిలో లక్షణాలు మారుతుంటాయని ఆమె తెలిపారు. అవి ఒక్కోసారి తీవ్రతరం అయితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సౌతాఫ్రికాలో వస్తున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ వేరియంట్ సోకినవే ఉంటున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటం.. ఇప్పటికే సౌతాఫ్రికాతో పాటు ఇతర దేశాలకు కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడంతో అన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను విధించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
దడపుట్టిస్తున్న B.1.1.529 variant .. హెవీ మ్యుటేషన్లపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
Omicron affect: మళ్లీ సరిహద్దులు మూసేసిన ఇజ్రాయెల్.. ఆ దేశంలోకి ఫారినర్స్‌కు నో పర్మిషన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

