గురువారం 04 మార్చి 2021
International - Jan 21, 2021 , 17:19:14

ఆమె 22 ఏళ్లుగా మేక‌ప్ వేసుకుంటూనే ఉంది.. కానీ స‌డెన్‌గా..

ఆమె 22 ఏళ్లుగా మేక‌ప్ వేసుకుంటూనే ఉంది.. కానీ స‌డెన్‌గా..

ఐదు నిమిషాల్లో రెడీ అవుతామ‌న్న ఆడ‌వాళ్ల‌ను అస్స‌లు న‌మ్మొద్దంటారు. ముఖ్యంగా ఈ విష‌యం పెళ్ల‌యిన మ‌గ‌వాళ్ల‌కు బాగా తెలుసు. భార్య‌ల‌ నోటి నుంచి రెడీ అవుతామ‌న్న మాట వ‌స్తే చాలు.. భ‌ర్త‌లు ఉసూరుమంటారు. మేక‌ప్‌కీ, ఆడ‌వాళ్ల‌కూ అంతటి విడ‌దీయ‌రాని బంధం మ‌రి. యూకేకు చెందిన ఓ మ‌హిళకు కూడా ఇలాగే మేక‌ప్‌కు బానిసైపోయింది. సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడో, ఏవైనా శుభ‌కార్యాల‌కు వెళ్లే స‌మ‌యంలోనో మేక‌ప్ వేసుకుంటారు. కానీ ఆ మ‌హిళ మాత్రం ప్ర‌తి రోజూ ఎక్క‌డికైనా వెళ్లినా వెళ్ల‌క‌పోయినా మేక‌ప్ చేసుకుంటూనే ఉండేది. అది కూడా ప్ర‌తి రోజూ ఈ మేక‌ప్ కోస‌మే గంట స‌మ‌యం కేటాయించేదంటే.. ఆమె మేక‌ప్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఆదివారం.. నో మేక‌ప్‌

అయితే ఈ మ‌ధ్య స‌డెన్‌గా ఆమె ఆదివారాలు మేక‌ప్ వేసుకోవ‌డం మానేసింది. మామూలుగా అయితే ప్ర‌పంచంలోని ఏ భ‌ర్తకైనా ఇది కాస్తోకూస్తో ఆనందం క‌లిగించే విష‌య‌మే. కానీ ఆమె భ‌ర్త మాత్రం అందుకు పూర్తి భిన్న‌మైన రియాక్ష‌న్ ఇచ్చాడట‌. బ‌హుశా ఆమెను 22 ఏళ్ల పాటు ఆ మేక‌ప్‌లో చూసీ చూసీ ఆ అందాన్నే ఆస్వాదించ‌డం వ‌ల్లో ఏమోగానీ.. స‌డెన్‌గా మేక‌ప్ మానేసేస‌రికి ఇలా ఉన్నావేంటీ అన‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆ మ‌హిళే చెప్పుకొని బాధ‌ప‌డింది. 22 ఏళ్లుగా రోజూ గంట పాటు మేక‌ప్ వేసుకొనీ, వేసుకొనీ విసుగొచ్చింద‌ని, అందుకే ఈ మ‌ధ్య ఆదివారాలు ఆ ప‌ని చేయ‌డం మానేశాన‌ని ఆమె చెప్పింది. ఈ కొత్త లుక్‌లో అస‌లు ఏమాత్రం సెక్సీగా క‌నిపించ‌డం లేద‌ని త‌న భ‌ర్త అంటున్నాడ‌ని ఆమె తెగ బాధ‌ప‌డిపోతోంది. ఇన్నాళ్లూ మేక‌ప్‌లో క‌నిపించి.. స‌డెన్‌గా ఇలా మారిపోతే ఎలా అని అడుగుతున్నాడ‌ట‌. ఆ మాట విని చిర్రెత్తుకొచ్చిన ఆమె.. ఇదేం న్యాయ‌మంటూ ప్ర‌శ్నిస్తోంది. మేక‌ప్ ఇప్పుడా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. 

VIDEOS

logo