లండన్: క్లినికల్ ట్రయల్స్‌లో వైద్యు లు ఓ క్యాన్సర్ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఓ 42 ఏండ్ల మహిళను క్యాన్సర్బారి నుంచి బయటపడేసింది. ‘డోస్టర్లిమాబ్’ అనే కొత్త డ్రగ్‌ను ఆరు నెలలు వాడగా.. స్టేజ్-3 క్యాన్సర్ కనుమరుగయ్యాయి.
క్యాన్సర్ చికిత్సలో దీనిని ఓ మిరాకిల్ డ్రగ్‌గా వారు పేర్కొన్నారు. ‘రేడియోథెరపీ, సర్జరీ, కీమోథెరపీ లేకుండా చికిత్స అందించాం. ‘డోస్టర్లిమాబ్’ క్యాన్సర్ కణాలపై అద్భుతంగా పనిచేసింది’ అని స్వాన్స్సీ బే యూనివర్సిటీ హెల్త్ బోర్డ్ తెలిపింది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఇమ్యునోథెరపీ డ్రగ్ ఇది. గత ఏడాది ఈ ఔషధాన్ని వాడిన 18 మంది క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడ్డారని వైద్య పరీక్షల్లో తేలింది.