US Senator | భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నుంచి ఆయిల్ (Russian oil) దిగుమతి చేసుకుంటే 100 శాతం సుంకాలు విధించనున్నట్లు యూఎస్ సెనేటర్ (US Senator) లిండ్సే గ్రాహమ్ (Lindsey Graham) హెచ్చరించారు. భారత్ మాత్రమే కాకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే చైనా (China) , బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేసి యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యా (Russia)ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న (Russia business ties) భారత్, చైనాపై 500 శాతం సుంకాలు (500 Percent tariff) విధిస్తామని ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వార్నింగే ఇచ్చింది.
రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే భారత్, చైనా సహా మాస్కో వాణిజ్య భాగస్వాములైన దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధిస్తారని లిండ్సే గ్రాహమ్ తాజాగా హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రాహమ్ మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించబోతున్నారు. ఆయా దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించనున్నారు. మీరు తక్కువ ధరకు ఆయిల్ కొని, యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తే అమెరికా మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు..!
మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న (Russia business ties) భారత్, చైనాపై 500 శాతం సుంకాలు (500 Percent tariff) విధిస్తామంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ (Lindsey Graham) ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్ (India), చైనా (China) దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు.
రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్ తెచ్చే ఈ బిల్లు భారత్, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
Also Read..
Worlds Safest Country | అత్యంత సురక్షితమైన దేశాల్లో మనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన పాకిస్థాన్..!
YouTube | 11వేల యూట్యూబ్ చానల్స్‌పై గూగుల్ వేటు..! చైనా, రష్యావే ఎక్కువ..!
Maria Farmer | ‘ఆ రాత్రి డొనాల్డ్ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం’.. వెల్లడించిన నటి మారియా ఫార్మర్