వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాపై మళ్లీ విరుచుకుపడ్డారు. అమెరికా-కెనడాను కలుపుతూ రూ.57 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ‘గోర్డీ హోవే’ వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటానని ట్రంప్ బెదిరింపులకు దిగారు. అమెరికా కెనడాకు ఇచ్చిన ‘ప్రతిదానికీ పూర్తిగా పరిహారం’ చెల్లించే వరకు వంతెన ప్రారంభోత్సవం జరగదు అని తేల్చేశారు. ‘బై అమెరికన్ యాక్ట్’ను పక్కనపడేసి, చైనాతో కెనడా వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకోవటంపై ఆయన మండిపడ్డారు.