Mojtaba Khamenei : ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమూ మూడునెలలు పూర్తైంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియలేదు. కానీ, ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు. మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారో తనకు తెలుసని అన్నారు. అయితే, ఈ విషయంలో కచ్చితమైన సమాచారం చెప్పలేనని, కానీ, బహశా ఆ వివరాలు తనకు తెలుసన్నారు.
అలాగే, అతడు తీవ్రంగా గాయపడ్డాడని కూడా ట్రంప్ తెలిపారు. అదే సమయంలో అతడు ఎక్కడున్నాడో వెల్లడించేందుకు మాత్రం ట్రంప్ నిరాకరించాడు. ఆ విషయం చెప్పలేనన్నాడు. మొజ్తాబా యువకుడు అని, అతడు తన తండ్రి కంటే మంచి ఆచరణాత్మక విలువలు కలిగిన వాడని ప్రశంసించారు. అతడు జాతీయవాది, ధైర్యవంతుడని ట్రంప్ అన్నారు. మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డప్పటికీ దేశం గురించి నిర్ణయాలు తీసుకుంటున్నాడన్నారు. కీలక సూచనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇదే సమయంలో తాను ఏదో ఒక రోజు మొజ్తాబాను కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నారు.
.@POTUS on Mojtaba Khamenei: “I don’t want to say whether or not I know where he is, but there’s a good probability that I do… He’s very seriously injured.” pic.twitter.com/BgzgTk4AVy
— Rapid Response 47 (@RapidResponse47) June 7, 2026
గత ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన దాడిలో మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అప్పటినుంచి అతడు ఇరాన్లో ఎక్కడా కనిపించలేదు. బయటకు రాలేదు. దీంతో అతడి ఆరోగ్యంపై ప్రచారం మొదలైంది. అసలు అతడు బతికే ఉన్నాడా అనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఈ విషయాన్ని ఇరాన్ ఖండించింది. అతడు ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.