న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఒక కొత్త నిర్వహణ ప్రణాళికను ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదించింది. ఈ ఇంధన మార్గం గుండా వెళ్లే నౌకలపై సుంకాలు విధించడం, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను ఈ జలమార్గం గుండా వెళ్లకుండా నిషేధించడం వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
ఈ ప్రణాళికలో మెరుగైన భద్రతా ఏర్పాట్లు, నౌకా భద్రతా నియమావళి, పర్యావరణ పరిరక్షణ చర్యలు వంటి అనేక కీలకాంశాలు ఉన్నాయి.