Basmati Rice | యుద్ధం ఎఫెక్ట్.. భారత్‌లో నిలిచిపోయిన బాస్మతి రైస్ ఎగుమతులు
Basmati Rice | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (US) చేస్తున్న యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. ఈ యుద్ధం పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. భారత బాస్మతీ రైతుల (Basmati Farmers) పై కూడా ఈ యుద్ధం ప్రభావం పడింది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే సుమారు రూ.50 వేల కోట్ల విలువైన బాస్మతి పరిశ్రమ.. ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
Basmati Rice : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (US) చేస్తున్న యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. ఈ యుద్ధం పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. భారత బాస్మతీ రైతుల (Basmati Farmers) పై కూడా ఈ యుద్ధం ప్రభావం పడింది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే సుమారు రూ.50 వేల కోట్ల విలువైన బాస్మతి పరిశ్రమ.. ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు వెళ్లే సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి.
ఈ క్రమంలో ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో సుమారు 10 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. దీనికి తోడు, షిప్పింగ్ కంపెనీలు ‘వార్-రిస్క్ సర్ ఛార్జ్’ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇది బాస్మతి బియ్యం ఎగుమతిదారులకు పెను భారంగా మారింది. మరోవైపు ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకులకు సంబంధించి చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఇరాన్ వంటి దేశాల నుంచి రావాల్సి ఉన్న రూ.2,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో బాస్మతీ ధర క్వింటాల్‌కు రూ.800 వరకు పడిపోయింది. ఇది పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్ముకాశ్మీర్ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మొత్తం బాస్మతీలో 70 నుంచి 75 శాతం సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ లాంటి దేశాలకే వెళ్తుంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. భారత మార్కెట్‌ను పాకిస్థాన్ వంటి పోటీ దేశాలు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

