Donald Trump : ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరాన్‌పై అమెరికా మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌పై ఈరోజు రాత్రి భారీదాడులు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు క్షేత్రాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామన్నారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్ధ్యం బలహీనపడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సహా ఇరాన్‌కు చెందిన అన్ని రక్షణ వ్యవస్థలు నాశనమయ్యాయని ప్రకటించారు. ఇరాన్లో అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌తోపాటు, చమురు నిల్వ క్షేత్రాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఐలాండ్‌తోపాటు అక్కడి చమురు క్షేత్రాలను పూర్తిగా అధీనంలోకి తెచ్చుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. వెనెజులాలాగే ఇరాన్ చమురు మార్కెట్‌ను శాసిస్తామన్నారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు చేస్తోంది. భారతీయులున్న నౌకపై కూడా అమెరికా దాడులు చేసింది.
ఈ దాడుల ఘటనలో ముగ్గురు భారతీయులు మరణించారు. రెండు రోజులుగా ఇరాన్, అమెరికా దాడులు చేసుకుంటున్నాయి. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్‌లోని చమురు క్షేత్రాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ పోర్టులతోపాటు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి చేస్తోంది.ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా కూడా ఆగిపోయింది.