PM Modi : భారత ప్రధాని (Indian PM) నరేంద్రమోదీ (Narendra Modi) ఉక్రెయిన్ (Ukraine) లో పర్యటిస్తున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన ఇవాళ (శుక్రవారం) ఉదయం ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukrane) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) వ్లాదిమిర్ జలెన్‌స్కీ (Volodymyr Zelensky) తో సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ ప్రధానితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.
#WATCH | Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi in Ukraine’s Kyiv pic.twitter.com/NbXTxGKKNx
— ANI (@ANI) August 23, 2024
#WATCH | PM Modi and Ukrainian President Volodymyr Zelenskyy honour the memory of children at the Martyrologist Exposition in Kyiv pic.twitter.com/oV8bbZ8bQh
— ANI (@ANI) August 23, 2024
ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవార్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్‌స్కీతో కలిసి ప్రధాని వీక్షించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు. పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.
కాగా, ఈ సాయంత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని భేటీ కానున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలతోపాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయం కూడా వారి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.