వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య.. వైట్‌హౌజ్‌లో మీడియా ముందే సంభాషణలు జరిగాయి. రష్యాతో యుద్ధం అంశంపై చర్చించుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. రష్యాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని జేడీ వాన్స్ సూచించారు. ఆ సమయంలో ఎటువంటి దౌత్యం అని జెలెన్స్కీ ఎదురు ప్రశ్న వేశారు. 2019 నాటి ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ చేపట్టాలని వాన్స్ సూచించారు. కానీ ఆ ప్రతిపాదనను జెలెన్స్కీ తోసిపుచ్చారు. దీంతో ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం మొదలైంది. ట్రంప్, జెలెన్స్కీ సంభాషణకు చెందిన వీడియో ఇదే.
I recommend watching the full conversation between Trump and Zelensky before forming strong opinions
(This is true for any situation)
— Shaun Maguire (@shaunmmaguire) February 28, 2025
యుద్ధ సమస్యను పరిష్కరించేందుకు రష్యాతో దౌత్యం చేయాలని అమెరికా నేతలు సూచించారు. కానీ జెలెన్స్కీ ఆ అభిప్రాయాలను విస్మరించారు. ఆ సమయంలో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. తమకు హుకూం జారీ చేయరాదన్నారు. మూడవ ప్రపచం యుద్ధాన్ని కాంక్షిస్తున్నావని ట్రంప్ పేర్కొన్నారు. సైనికులు చనిపోతున్నారని, నీ దగ్గర శక్తిలేదని జెలెన్స్కీని నిలదీశారు. కాల్పుల విరమణ పాటిస్తే, రక్తపాతాన్ని ఆపవచ్చు అన్నారు.యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ భావిస్తున్నారని ట్రంప్ పలుసార్లు ఆ సంభాషణల్లో తెలిపారు. అయితే మనం ఇద్దరం కలిస్తే, పుతిన్‌ను అడ్డుకోవచ్చు అని ఓ దశలో జెలెన్స్కీ పేర్కొన్నారు.