మాస్కో: కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల నివాస భవనాలపై శనివారం డ్రోన్లతో దాడులు జరిపిన ఉక్రెయిన్ ఎన్నో రెట్లు ఎక్కువ విధ్వంసాన్ని ఎదుర్కొనక తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం హెచ్చరించారు. తాను చేసిన పనికి ఉక్రెయిన్ చింతించక తప్పదని పుతిన్ ప్రకటించారు.
ఎవరు ఎంతలా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తే వారు అంతకు మించి ఎన్నో రెట్ల విధ్వంసాన్ని చవిచూడక తప్పదని అంటూ పుతిన్ హెచ్చరికలు జారీచేశారు.