వాషింగ్టన్: ఒహియో గవర్నర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని భారతీయ అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడుతున్నట్టు ‘ఎక్స్’లో ఆయన ప్రకటించారు.
వివేక్ రామస్వామి గెలుపొందాలని కోరుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్లు ‘ఎక్స్’లో స్పందించారు.