సాధారణంగా జంతువులు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాయి. కానీ కుందేళ్ల వంటి సాధు జంతువులు కొట్టుకోవడం అరుదు. అది కూడా నడిరోడ్డుపై చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా గొడవ పడటం దాదాపు జరగదు. ఎందుకంటే వాటికి మనుషులంటే చాలా భయం.
కానీ ఒక రెండు కుందేళ్లు మాత్రం అసలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి.. ఎదుటి కుందేలును పడగొట్టాలనే కసితో ఫైటింగ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన పార్కింగ్‌లో కారు ఆపి బయటకు చూస్తున్నాడతను. కొంచెం దూరంలో రెండు కుందేళ్లు ఫైటింగ్ చేసుకోవడం చూసి, వెంటనే మొబైల్లో దాన్ని వీడియో తీశాడు. ఇప్పుడు ఆ గొడవకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
నెట్టింట ప్రత్యక్షమైన ఈ వీడియోలో రెండు కుందేళ్లు రోడ్డుపై గొడవ పడుతున్నాయి. వెనక కాళ్లపై లేచి నిలబడి కొట్టుకుంటున్నాయి. కాసేపటికే ఒక కుందేలు పారిపోవడానికి ప్రయత్నించగా.. రెండోది దాన్ని వెంబడించింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Street fight.. 😅 pic.twitter.com/QiQalPL9mT
— Buitengebieden (@buitengebieden) July 7, 2022