జంతువులైనా, మనుషులైనా తల్లిదండ్రులందరూ పిల్లలను కాపాడేందుకే ప్రయత్నిస్తారు. అప్పుడప్పుడూ బలవంతం చేసినా అది పిల్లల మంచి కోసమే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే విషయాన్ని చూపిస్తోంది. ఒక సపారీ పార్కులో ఒక ఏనుగు, దాని పిల్ల రోడ్డు దాటుతున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న కొందరు టూరిస్టులను పిల్ల ఏనుగు చూసింది.
అంతే ఉత్సుకతతో వాళ్ల దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన తల్లి ఏనుగు వెంటనే వెనక్కు వచ్చి తన పిల్ల మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. తొండంతో గున్నఏనుగును వెనక్కు మళ్లించి, దగ్గరకు రావొద్దన్నట్లు టూరిస్టుల వైపు చూసి, పిల్లను వెంటపెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ ఏనుగు తల్లిప్రేమకు ముచ్చటపడిపోతున్నారు. ప్రపంచంలో ఎదురయ్యే కష్టాల నుంచి పిల్లలను ఇలా కాపాడటమే కదా పేరెంటింగ్ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. తల్లులంతా ఇలాగే తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని మరికొందరు చెప్తున్నారు.
Mother elephant stops its child from approaching the tourists.. pic.twitter.com/ASruHsJKnn
— Buitengebieden (@buitengebieden) September 3, 2022