సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నాడా యువకుడు. ఆ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు మాట్లాడేలోపే కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. ఒక అధికారి ముక్కు పగిలేలా గుద్దాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఒక సబ్వే ట్రాక్ ఎక్కేసి, అక్కడి నుంచి రోడ్డుపై ఉన్న ఒక బిల్డింగ్ పైకి దూకాడు.
ఈ ఘటన బ్రూక్లిన్‌లో వెలుగు చూసింది. కెండాల్ ఫ్లాయిడ్ అనే యువకుడు అలా బిల్డింగ్‌పై దూకేందుకు ప్రయత్నిస్తుంటే.. రోడ్డుపై ఉన్న పోలీసులు, జనాలు కేకలు వేస్తూ, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల మాటలు వినిపించుకోకుండా కెండాల్ దూకేశాడు. ఈ క్రమంలో కాలుకు దెబ్బ తగలడంతో కాసేపటికే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
పోలీసుపై దాడి చేయడం, సీట్ బెల్టు లేకుండా డ్రైవ్ చేయడం వంటి కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కెండాల్ ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు. అతను చేసిన ఈ స్టంట్‌ను వీడియో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
#Subway #Jumper @MTA suspect fleeing #NYPD. pic.twitter.com/a5xsiqyIWr
— Isaac Abraham (@IsaacAb13111035) July 7, 2022