McDonald women real story | ఒక మహిళ తన కుటుంబ సభ్యులకు అవసరమైన భోజన వసతులన్నీ సకాలంలో సమకూరుస్తూ ఉంటుంది. అనుకోకుండా ఎప్పుడైనా భారీ సంఖ్యలో అతిథులు వస్తే.. అదీ భోజనాల వేళకు వస్తే సదరు మహిళ పడే హైరానా అంతా ఇంతా కాదు.. వారందరికీ వండి వడ్డించాలంటే మాటల్లో చెప్పడం కష్టం. వచ్చిన అతిథులు కూడా కాస్త సాయం చేస్తే సకాలంలో అందరూ భోజనం చేస్తారు..
అదే ఒక హోటల్ కం ఫుడ్ డెలివరీ కంపెనీకి భారీ ఆర్డర్ వస్తే పరిస్థితేంటి. ఉద్యోగులు.. మేనేజ్మెంట్ నానా హడావుడి చేస్తుంటారు.. కానీ అమెరికాలోని జార్జియాలో పెర్రీ ప్రాంతంలో నడుపుతున్న మెక్‌డొనాల్డ్ హోటల్లో పని చేస్తున్న ఓ ఉద్యోగి బ్రిట్టానీ కుర్టీస్.. ఒకటి కాదు రెండు కాదు 6400 ఐటమ్స్ నాలుగు గంటల్లో వండి.. ఆర్డర్ చేసిన వారికి పంపించారు. అందులో 1600 మైక్ చికెన్శాండ్విచ్లు, 1600 మైక్ డబుల్స్, 3200 చాక్లెట్ చిప్ కుకీస్ ఉన్నాయి.
నాలుగు గంటల టైంలో ఇంత భారీ ఆర్డర్ ప్రకారం కుక్ చేసి.. బాక్స్‌ల్లో ప్యాక్ చేసి డెలివరీ చేయడం అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఆమె తాను ఆర్డర్ ప్రకారం వంటలు కుక్ చేసి, నాలుగు గంటల్లోనే డెలివరీకి పంపారు. ఈ వీడియోను ఆమె తన సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడంతో వైరలైంది. ఈ ఆర్డర్ బిల్లు సుమారు 7400 డాలర్లు.
ఈ వీడియోపై నెటిజన్లు బోల్డ్‌గా రియాక్టవుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. వాస్తవంగా ఆ ఆర్డర్‌ను వారు పికప్ చేసుకున్నారా? అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ రియాక్టవుతూ.. 1200 పిల్లలకు భోజనం అంటే చాలా విచారకరం. అది అత్యంత ఒత్తిడికి గురి చేసే టైం అని వ్యాఖ్యానించారు.
కామెంట్స్ బాక్స్‌లోనే బ్రిట్టానీ కుర్గీస్ ఇలా రాసుకొచ్చారు. తమకు ఆ ఆర్డర్ వచ్చింది రెగ్యులర్ కస్టమర్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. ఆ కస్టమర్ స్థానిక జైలు యాజమాన్యం అని తెలిపారు. అయితే సదరు ఫుడ్ ఖైదీలకా.. జైలు సిబ్బందికా అన్న విషయం వెల్లడించలేదు.
ఆర్డర్ ప్రకారం బాక్సుల్లో శాండ్విచ్లు నింపుతున్నప్పుడు ఇద్దరు సిబ్బంది అక్కడే నిలుచున్నారు. ఒకేసారి 20 శాండ్విచ్లు నింపేశారని అని చెప్పారు. శాండ్విచ్లు సాధ్యమైనంత ఎక్కువసేపు వేడిగా ఉంటాయని కుర్టీస్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!