బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 16:29:04

పెళ్లిలో గొడ‌వకు కార‌ణ‌మైన వాళ్ల‌ని చిత‌క‌బాదిన వ‌ధువు : వీడియో వైర‌ల్‌

పెళ్లిలో గొడ‌వకు కార‌ణ‌మైన వాళ్ల‌ని చిత‌క‌బాదిన వ‌ధువు :  వీడియో వైర‌ల్‌

అస‌లే క‌రోనా వ్యాప్తితో ఎన్నోరోజుల నుంచి పెళ్లి వాయిదా అవుతూ వ‌చ్చింది. తీరా ఇప్పుడు చేసుకుంటుంటే గొడ‌వ‌లు చేస్తారా?  మిమ్మ‌ల్ని ఏం చేసినా పాపం లేదంటూ వ‌ధువు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ.. గొడ‌వ‌కు కార‌ణ‌మైన వారికి చిత‌క‌బాదింది. ఈ సంఘ‌ట‌న‌ను అక్క‌డున్న వారు కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో హాట్ న్యూస్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌కు చెందిన జో డ‌ల్లిమోర్ ఇటీవ‌ల పెండ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్న‌ది. అందుకు పెద్ద‌గా ఉండే ర‌గ్బీ క్ల‌బ్‌లో ఆరేంజ్‌మెంట్స్ చేసుకొని న‌చ్చిన అబ్బాయిని పెండ్లి చేసుకున్న‌ది.

అంతా బాగానే జ‌రిగింది. త‌ర్వాత రిసెప్ష‌న్ మొద‌ల‌వుతుండ‌గా కొంద‌రు ఆక‌తాయిలు గొడ‌వ ప‌డ్డారు. గొడ‌వ‌ను ఆపేందుకు వ‌ధువు ఎంతో ప్ర‌య‌త్నించింది. తీరా అక్క‌డ‌ ఒక్క‌రు కూడా మాట విన‌లేదు. దీంతో చిర్రెత్తిన డ‌ల్లిమోర్  వెడ్డింగ్ డ్ర‌స్‌ను పైకెత్తి మ‌రీ వారి మీద పిడుగుద్దుల వ‌ర్షం కురిపించింది. తర్వాత ఈ ఘటన గురించి డల్లీ  స్పందిస్తూ.. అప‌రిచితుల‌కు నాకు ఎలాంటి గొడ‌వ జ‌ర‌గ‌లేదంటూ పేర్కొనడం విశేషం. 

Nothing like a good old punch up to end your wedding day. from r/trashy


logo